Saturday, November 22, 2008

ఇక్కడకు కూడా 'సామాన్యుడు ' వచ్చేశాడు

ఆదండీ విషయం ... 20వ శతాబ్దం అయినా నాలాంటి సామాన్యులకు కొదవ లేదు కదా; ఇక్కడకు కూడా వచ్ఛేసాం. చూడాలి ఈ హైటెక్ / హైసొసైటీ మనుషులు ఎంత మాత్రం పట్టించుకుంటారో!!! (I meant, to what extent these hi-tec & high society people care about a 'common man', their existence, presence, opinions, responses, feelings etc ... etc...)

6 comments:

బొల్లోజు బాబా said...

సామాన్యుడు గారు
స్వాగతం,
ఇప్పుడే పర్ణశాల బ్లాగులో మీ కామెంటుని బట్టి ఇలా వచ్చానండి. బ్లాగ్లోకా్నికి స్వాగతం.

ఇక్కడ ఉన్నటువంటి వారిలో అధిక శాతం సామాన్య మధ్య తరగతి వారో లేక దాని వారసులో తప్ప హైసొసైటి వాళ్ల పాత్ర తక్కువే అని నా అభిప్రాయం అండీ.

రాధిక said...

ఇక్కడ వుండేది అందరూ సామాన్యులే.కానీ ఆలోచనల్లోనో,అభిప్రాయాల్లోనో తమని తాము ఎక్కువగా ఊహించుకునేవారు మాత్రం బాగానే వున్నారు.

kumar said...

రాధిక గారూ,
భలే దులిపేసారుగా!!:-)
నేను కూడా అందులో ఒకణ్ణి.

కొత్త పాళీ said...

బ్లాగుల్లో మీరు మొదటి సామాన్యుడినని భావిస్తున్న మీ గర్వము సర్వము ఖరము జేయుటకు చింతిస్తు్న్నాను. సుమారు రెండేళ్ళ క్రితం ఒక ఆఫీసు కి సెక్యూరిటీగార్డుగా పనిచేసే ఒకతను కొన్నాళ్ళు ఒక బ్లాగు రాశాడు.

కత్తి మహేష్ కుమార్ said...

మేమూ సామాన్యులమే! కాకపోతే, కాలక్రమేణా కొంత ‘సామాను’ కొంత ‘మాన్యతా’ కలిపించుకుని మరింత సామాన్యంగా తయారయ్యాం అంతే.

మన ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం సామాన్యుడిదే! అందులో మాత్రం ఎవరికీ ఏవిధమైనా సందేహం ఉండదు. ఉండకూడదుకూడా!!

netizen నెటిజన్ said...

కొత్తపాళీ గారు చెప్పిన ఆ సెక్యూరిటి గార్డ్ ఏమైపొయ్యాడో! అందరూ సామన్యులే అండి. మీకు స్వాగతం!